కుంటాల మండలంలో మంగళవారం జరగబోయే నిమజ్జనం శోభయాత్రను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సోమవారం ఎస్ఐ భాస్కరచారి ఒక ప్రకటనలో తెలిపారు. శోభ యాత్రలో అధిక సౌండ్ ఉన్న డీజేలను పెట్టవద్దని పూర్తిస్థాయిలో పోలీసులకు సహకరిస్తూ, పోలీస్ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.