కుంటాల మండల కేంద్రంలోని బాలుర వసతి గృహాన్ని మంగళవారం ఎంఈవో వాటోలి ముత్యం సందర్శించారు. హాస్టల్లో వసతులను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు సూర్య నమస్కారాలు, యోగ పై అవగాహన కల్పించారు. విద్యార్థులకు వివిధ రకాల సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేయించారు. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే యోగ అవసరం అని అన్నారు.