బ్రహ్మాండంగా లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు

381చూసినవారు
బ్రహ్మాండంగా లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు
లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ గ్రామశివారులో వెలసి కొలిచిన భక్తుల పాలిట కొంగు బంగారమై కోరికలు నెరవేరుస్తున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ రాజ్యలక్ష్మీ సహిత నారాయణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కన్నుల పండువగా జరుగుతున్నాయి. రెండవరోజైన ఆదివారం ఉదయం నుండి శాంతి పాఠము, స్థాపిత దేవత పూజ, సూక్తహవనంలు, చండీహోమం, మహా సుదర్శనహోమం, హారతి నివేదన, మంత్రపుష్పం, ప్రసాద వితరణ, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయకమిటీవారు మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం లాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణలతో స్వామివారి వార్షికోత్సవ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని, సోమవారం శ్రీ రాజ్యలక్ష్మి సహిత లక్ష్మీ నారాయణ స్వామి దివ్యకళ్యాణ మహోత్సవం, మధ్యాహ్నం 1 గంట నుండి అన్నదానం కార్యక్రమాలు నిర్వహించనున్నామని స్వామివారి సేవకు భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాన్ని పొందాలని మండల ప్రజలకుతెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ సభ్యులు, శ్రీనివాస్ రెడ్డి కృష్ణారెడ్డి, మహిపాల్ రెడ్డి, ఆపద్ధర్మ సర్పంచ్ గంగాధర్, వేద పండితులు, సంతోష్ పంతులు, ఆలయ పూజారి నరసింహ స్వామి, మహిళలు, యువకులు, ఆయా గ్రామాల భక్తులు, గ్రామస్తులు, మరియు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్