గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: ఎంపీడీఓ

60చూసినవారు
గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: ఎంపీడీఓ
తానూర్ ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం ఎంపిడిఓ అబ్దుల్ సమద్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఈజీయస్ టిఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల గూర్చి గ్రామాల వారీగా పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. ఈజీయస్ ద్వారా గ్రామాల్లో చేపట్టిన పనుల వివరాలను తెలుసుకున్నారు. గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్