హైదరాబాద్లో జరిగిన తెలంగాణ సైన్స్ అకాడమీ సంస్థ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బాసర ఆర్జీయూకేటీలో బయలజీ డిపార్ట్మెంట్ కు చెందిన సీనియర్ అధ్యాపకులు డాక్టర్ కైరంకొండ మధుసూదన్ యంగ్ సైంటిస్ట్ అవార్డును అందుకున్నారు. సైన్స్ రంగంలో కృషి చేసినందుకుగాను మధుసూదన్ కు అవార్డు రావడం హర్షణీయమని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకటరమణ అభినందించారు.