తానూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారంతో 5వ రోజుకు చేరింది. కార్మికులు చీపురు కట్టెలతో ఊడుస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు వంట చేయడానికి అప్పులు చేసి పని చేస్తూ వచ్చినా, ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.