భైంసా పట్టణంలోని కమల థియేటర్ సమీపంలోని ఓ బిర్యానీ సెంటర్లో ఆహారంలో పురుగు రావడంతో మున్సిపల్ అధికారులు హోటల్ కు తాళం వేశారు. వినోద్, నరేశ్ అనే కస్టమర్లు గురువారం హోటల్లో భోజనం చేసేందుకు వచ్చారు. సిబ్బంది తెచ్చిన భోజనంలో పురుగు ఉన్నట్లు గుర్తించి నిర్వాహకుల దృష్టికి తెచ్చారు. ఈ దృశ్యాన్ని వీడియో తీసి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారులు చూపిన వీడియో ఆధారంగా హోటల్కు తాళం వేసినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ అనీస్ తెలిపారు.