జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి

267చూసినవారు
జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి
నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని భోసి గ్రామ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి సందర్శించి పాఠశాలోని పలు రికార్డులను పరిశీలించారు. పదోతరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పరీక్షల సంసిద్ధత గూర్చి మార్గ నిర్ధేశం చేశారు. ఆనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమాశం నిర్వహించి తగు సలహాలు, సూచనలు చేశారు, మధ్యాహ్న భోజనం, తరగతి గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పసుల గంగాధర్, ఉపాధ్యాయులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్