ఉపాధి హామీలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని కోరుతూ నిర్మల్ డీఆర్డీవో పీడీ కార్యాలయంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్ సోమవారం వినతి పత్రం అందజేశారు. కడెం మండలం నరసాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీల నుండి పాత మెట్ల ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ప్రతి ఒక్కరి దగ్గర వారానికి 100 రూపాయలు వసులు చేస్తున్నారని వారిపై చర్యలు చేపట్టాలని కోరారు.