నిర్మల్: బావిలో పడి పంచాయితీ వర్కర్ మృతి

69చూసినవారు
నిర్మల్: బావిలో పడి పంచాయితీ వర్కర్ మృతి
నిర్మల్ రూరల్ మండలం అనంతపేట్ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు. గ్రామానికి చెందిన భీమరాజు (28) అనే గ్రామపంచాయతీ వర్కర్ మంగళవారం జీపీకి సంబంధించిన బావిలో బోర్ మోటార్ మరమ్మతు కోసం నీటిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు బావిలో పడి నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్