నితీశ్, చంద్రబాబులు అసంతృప్తితో ఉన్నారు: సంజయ్ రౌత్

59చూసినవారు
నితీశ్, చంద్రబాబులు అసంతృప్తితో ఉన్నారు: సంజయ్ రౌత్
కేంద్ర కేబినెట్‌లో మంత్రిత్వ శాఖల కేటాయింపు తర్వాత ఎన్డీయే మిత్రపక్ష నేతలు నితీశ్ కుమార్, చంద్రబాబు నాయుడులు అసంతృప్తితో ఉన్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం ఎక్కువ కాలం నిలిచే పరిస్థితిలో లేదని తెలిపారు. అంతేగాక మంత్రి పదవులు కేటాయించిన విధానం ఎన్డీయే భాగస్వామ్య పార్టీలందరిలోనూ అసంతృప్తికి దారి తీసిందని విమర్శించారు. వారందరినీ సంతృప్తి పర్చడం మోదీ వల్ల కాదన్నారు.

సంబంధిత పోస్ట్