65 శాతం రిజర్వేషన్‌కు బిహార్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను పాట్నా హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందిస్తూ.. ‘రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని అనుమానించాం. అదే చెబుతూ వచ్చాం. కులగణన సమయంలోనూ బీజేపీ ఇలానే చేసింది. అందులో మేం గెలిచాం. అయితే, కోర్టు తీర్పుపై సీఎం నితీశ్‌కుమార్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారో అర్థం కావటంలేదు’ అని చెప్పుకొచ్చారు.