జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరులో మండల జీవశాస్త్రం ఫోరం అధ్వర్యంలో జీవశాస్త్ర విజ్ఞాన ప్రతిభ పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. ఇట్టి పోటీ పరీక్షలలో కల్లడి, మచ్చర్ల, దేగాం, మిర్జాపల్లి మరియు ఆలూరు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గం. లకు ప్రారంభమై 3 గం. లకు ముగిసింది.