మంగళవారం బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల్ తహశీల్దార్ కార్యాలయంలో నిరసన తెలియజేస్తూ వినతి పత్రాలు అందజేయడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ ఆనాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బండారి యాదగిరి, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నాశర మల్లయ్య పాల్గొన్నారు.