ఆర్ముర్ మండలం ఆలూరు పాఠశాలలో డాక్టర్ శీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణి చేశారు. దంత వైద్య శిబిరాన్ని పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రాజేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో PRTU రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మొహమ్మద్ అశ్ఫాక్ అహ్మద్, సుబ్బా రెడ్డి, గణేష్ తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.