ఆర్మూర్ పట్టణంలోని హుస్నాబాద్ గల్లీలో శ్రీ ఆంజనేయం యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి వద్ద శనివారం ఓడి బియ్యంతో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.