ఆర్మూర్ పట్టణం జిరాయత్ నగర్ లో గవర్నమెంట్ పాఠశాలకు సుమారు రూ. 6000/- విలువ గల సౌండ్ సిస్టమ్ మరియు రూ. 4500/- విలువ గల ఆట వస్తువులను శనివారం వితరణ చేయడం జరిగినది. రోటరీ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ మాట్లాడుతూ పిల్లలు చదువుతోపాటు, క్రీడలలో కూడా రాణించాలి మరియు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నామని బాధపడవద్దు గొప్ప వ్యక్తులందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారేనని పిల్లలకు సూచించారు.