నిజామాబాద్ నగరంలో మున్నూరు కాపు సంఘంలో దివంగత నేత మాజీ మంత్రి డి శ్రీనివాస్ బుధవారం ద్వాదశ దినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ బిజెపి నాయకులు, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ కుమార్ పాల్గొని డి. శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి నాయకుడు, తదితరులు పాల్గొన్నారు.