ప్రాథమిక పాఠశాల ఆలూరుకు మంగళవారం 20 డ్యూయల్ డెస్క్ బెంచీలను పారిశ్రామికవేత్త ఏ. దయానంద్ రెడ్డి వితరణ చేశారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మురళి కృతజ్ఞత సమావేశం నిర్వహించారు. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆలూరు మండల విద్యశాఖాధికారి యం. నరేందర్ విచ్చేసి ప్రసంగిస్తూ దేవేందర్ రెడ్డి సమాజిక కార్యక్రమాలు చేపట్టుతూ జిల్లాలో అనేక పాఠశాలలో కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.