ఆర్మూర్ మండలం, రాంపూర్ గ్రామంలో బ్రదర్స్ యూత్ 14వ వార్షికోత్సవం ఆధ్వర్యంలో గురువారం దేవి శరన్నవరాత్రులలో భాగంగా శ్రీ మహా గౌరీ దేవి అవతారం సందర్భంగా హోమము అన్న ప్రసాదం కార్యక్రమం పూజ శ్రీనివాస్ పంతులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి రోజు సాయంత్రం దేవికి పూజలు చేసి అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు దాండియా నిర్వహిస్తున్నామని యూత్ సభ్యులు తెలిపారు.