ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన ప్యాసింజర్లు

13547చూసినవారు
ఆర్మూర్ బస్టాండ్లో కొందరు బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. కండక్టర్ కోసం హారన్ కొట్టిన డ్రైవర్ పై ప్యాసింజర్లు దాడి చేశారని బస్సులు నిలిపివేసి డ్రైవర్లు నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ.. నిత్యం ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే తమపై భౌతిక దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. ఈఘటనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్