ముప్కాల్ మండలం MPPS కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శనివారం తెలంగాణ ఆహారోత్సవం కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాధికారి రవి కుమార్ మాట్లాడుతూ విద్యార్ధుల తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చేసే వంటకాలను పది మందితో పంచుకునేలా కార్యక్రమం నిర్వహించమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనికేషి రఘు, శివశంకర్, శ్రీనివాస్ ఉపాధ్యాయలు,
సాయిలు, ధనుంజయ్, సుజాత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.