ఆర్మూర్ లో ఈ నెల 29న వాహనాల వేలం

64చూసినవారు
ఆర్మూర్ లో ఈ నెల 29న వాహనాల వేలం
గత కొన్ని సంవత్సరాలుగా రవాణా శాఖ అధికారులు సీజ్ చేసి వివిధ చోట్ల ఉంచిన వాహనాలకు నోటీసులు పంపారు. వాటి ఓనర్లు,ఎవరూ కూడా సంప్రదించనందున అట్టి వాహనాలకు పై అధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 29న వేలం వేయనున్నట్టు ఆర్మూర్ మోటార్ వాహన తనిఖీ అధికారి గుర్రం వివేకానంద రెడ్డి శనివారం తెలిపారు. ఆర్మూర్ వాహన తనిఖీ అధికారి కార్యాలయం యూనిట్ ఆఫీస్ లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్