వేల్పూర్ మండలం సంతోష్ నగర్ గ్రామంలో బిజెపి అధికార ప్రతినిధి జేసు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతి నిర్వహించారు. ఆయన విగ్రహం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ దేశం కోసం, ధర్మం కోసం, దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.