వేల్పూర్ మండలంలో గురువారం పడగల్ గ్రామంలో వివిధ పంటలను మండల వ్యవసాయ అధికారిని ఎస్. శృతి పరిశీలించారు. ముఖ్యంగా రైతులు యాసంగిలో జొన్న పంటలో వచ్చు వివిధ పురుగులను గుర్తించడం జరిగింది. వాతావరణ దృశ్యా జొన్న పంటలో పేను బంక అధికంగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. పురుగు యొక్క ఉధృతి మొక్క అడుగుభాగంలో ఉండి రసాన్ని పీలుస్తుంది. తెగులు సోకిన మొక్కలు లేత పసుపు రంగులోకి మారి కుంగిపోతాయి.