వేల్పూర్ మండల కేంద్రంలో గురువారం జామా మసీద్ వద్ద భారత తొలి ముస్లిం విద్యావేత్త ఫాతిమా షేక్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆ మహానీయురాలి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. చీకట్లను చీల్చిన జ్ఞాన కిరణం ఫాతిమా షేక్ అని వారు కొనియాడారు. ఆమె గొప్ప ఆదర్శమూర్తి అని, అందరు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని వారు తెలియజేశారు.