మైనర్ బాలికపై అత్యాచారయత్నం

51276చూసినవారు
మైనర్ బాలికపై అత్యాచారయత్నం
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాదు మండలంలోని దుర్గి గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన సంఘటన స్థానికంగా కలకలం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 28 సంవత్సరాల బేగరి రవి కుమార్ సోమవారం రాత్రి చార్జింగ్ కోసమని ఇంటి పక్కనే ఉన్న అన్న ఇంట్లోకి వెళ్లాడు. నిద్రిస్తున్న అన్న కూతురైన 9 సంవత్సరాల బాలికపై వరుసకు బాబాయి అయిన రవి అత్యాచారం చేసినట్లు తెలిపారు. బాలిక ఏడవడంతో బాలిక తల్లి లేచి రవిని ఇంట్లో నుంచి బయటికి పట్టుకొచ్చి చితకబాది స్థానికులకు తెలుపగా ఉదయం పోలీసులు సమాచారం అందిచడం జరిగింది. దీంతో పోలీసులు దుర్గి చేరుకొని విచారణ చేసి బాలికను బాన్సువాడ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. నిందితుని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టాటా బాబు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్