తీరుమార్చుకోని కిరాణా దుకాణదారులు

2669చూసినవారు
తీరుమార్చుకోని కిరాణా దుకాణదారులు
కరోనా వైరస్తో యావత్ ప్రపంచమే గడగడలాడిస్తున్న పరిస్థితిలో దేశాలే లాక్ డౌన్లో ఉన్న రోజులు ఇవి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిత్యావసర సరుకుల కోసం ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించయి. కిరాణా దుకాణాల్లో వ్యాపారస్తులు చేతులకు గ్లౌజులు, మాస్కులు, శానిటేజర్లు వాడకుండానే వ్యాపారం కొనసాగిస్తున్నారు. కిరాణల ముందు రెడ్ లైన్లో బయట ఉండి ప్రజలు కొనుకోవాలని ప్రజలకు సూచించాడం లేదు.

వ్యాపారస్తులే అవగాన లేకుండా వ్యవహరిస్తున్నారు. స్వీయ నియంత్రణ గాలికి వదలేస్తున్నారు. నిసిగ్గుగా వ్యాపారంకి తెగబడ్డారు. ప్రజలు ఏమైతే నాకేంటి వ్యాపారమే ముఖ్యము అంటూ అధిక లాభాలను ఆర్జింస్తు సరుకులు అధిక ధరలకు విక్రయిస్తు‌ ప్రజల రక్తము తాగుతున్నారని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తే కొందరు వ్యాపారులు లాక్ డౌన్ కారణంగా సరుకుల కొరత ఉందని చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రం తో పాటు బీర్కూర్, నసూర్లాబాద్, పిట్లం పలు మండలాల్లో ప్రజలన నిలువునా దోచుకుంటున్నారు.

అధిక ధరలకు సరుకులను అమ్మితే చర్యలు తప్పవని ఒకవైపు అధికారులు హెచ్చరిస్తున్నా మరోవైపు వ్యాపారులు ప్రజలను దోచుకోవడం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఓ కిరాణ దుకాణ నిర్వాహకుడు కొన్ని రోజుల క్రితం ఇదే విధంగా సరుకులను ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఫిర్యాదు రావడంతో బీర్కూర్ ఎస్సై సతీష్ అతనిపై కేసు నమోదు చేశారు. బాన్సువాడ డివిజన్ కేంద్రాల్లో పలు కిరొణ దుకాణాలు యాజ్యమానులు . మాస్కులు శానిటేజర్ లెకుండా వ్యాపారం నిర్వహిస్తున్నారు.

డీఎస్పీ దామోదర్ రెడ్డి వారి పై కేసులు నమోదు చేసినా దుకాణాదారుల తీరు ఇంకా మారలేదు. బీర్కూర్ మండల కేంద్రంలో ఉన్న హోల్సేల్ దుకాణాలు సైతం సరుకులను పెంచి అమ్మడంతో సాధారణ దుకాణాదారులు సైతం మరికొంత ధరలను పెంచి ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు దీనిని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివిధ మండలం ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్