
కామారెడ్డి: కూతురు వివాహంలో తండ్రి మృతి
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వరపల్లిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. కూతురు వివాహంలో తండ్రి మృతి చెందాడు. కన్యాదానం చేసిన కాసేపటికే పెళ్లి కూతురు తండ్రి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. పెళ్లి మండపం నుండి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా బాలచంద్రం మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.