భిక్కనూరు: పెళ్లి కావడం లేదని వ్యక్తి ఆత్మహత్య
భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన మాసుల సంతోష్(26) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్య కుటుంబ సభ్యులు సంతోష్ కు పెళ్లి చేయాలని ఎన్ని సంబంధాలు చూసిన ఒక్కటి కూడా సెట్ కాలేదు. దీనితో మనస్తాపానికి గురైన సంతోష్ ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.