నిజామాబాద్: ద్విచక్ర వాహనం ఢీకొని బాలుడికి తీవ్ర గాయాలు
బీర్కూర్ శివారులోని మంజీరా వారధిపై సోమవారం ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మూడేళ్ళ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బంధువుల వివరాల ప్రకారం బాన్సువాడ మండలం తాడ్కోల్ కు చెందిన సునీల్ కుమార్, పావని దంపతులు మంజీరా వారధి చూడడానికి వెళ్లారు. రోడ్డు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.