తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామనే తృప్తి ఉందని మంత్రి రాజనర్సింహ అన్నారు. పాలనకు ఏడాది పూర్తవుతున్న వేళ ఆరోగ్య ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. 'వైద్యం వ్యాపారపరం కావొద్దు. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తున్నాం.ఎక్కడా మందుల కొరత లేకుండా చేశాం. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం' అని వ్యాఖ్యానించారు.