ఎడపల్లి మండలం ఏ. ఆర్. పి. క్యాంప్ గ్రామంలో ప్రవీణ్ అనే యువకుడు అతని ఇంటి పై ఉన్న కాకి మంజ దారం కు తగిలి కొట్టుకుంటున్న దాన్ని గమనించాడు. ఆ కాకి రెక్కకు దారం తగిలి ఎటు వెళ్లలేక, కొట్టుకుంటున్న సమయంలో ఆ యువకుడు ఆ మంజ దారాన్ని తొలిగించి కాకిని కాపాడాడు. అతను చేసిన మంచి పనికి గ్రామస్థులు మెచ్చుకున్నారు. ఈ కాలంలో మనిషికి మనిషే సహాయం చేయడం లేదు అన్న దానికి ఇది ఒక ఉదాహరణ. మనం ఒకరికి సాయం చేస్తే , మనకు ఆ దేవుడు సాయం చేస్తాడు అని నమ్మాలి. నమ్మకం తోటి బ్రతకాలి, నమ్మకం లేకుంటే బ్రతుకే లేము అని అతడిని పలువురు మెచ్చుకుంటున్నారు.