బోధన్ అట్టణం ద్వారకా నగర్ లో గల శ్రీ శిరిడి సాయిబాబా ఆలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఆలయంలో స్వామివారికి తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ అశోక్ కులకర్ణి మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తుల కొరకు మధ్యాహ్నం 12: 30 గంటలకి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.