బోధన్ పట్టణంలోని ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద సమ్మె నిర్వహిస్తున్న కార్మికులకు శనివారం రేషన్ డీలర్లు మద్దత్తు పలికారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. హమాలీల దీక్ష వలన రేషన్ షాపులకు రేషన్ బియ్యం సరఫరా నిలిచిపోయిందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం నాయకులు పాల్గొన్నారు.