బోధన్ డివిజన్ పరిధి ప్రజలకు సోమవారం ఏసీపీ శ్రీనివాస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని అన్నారు. డిసెంబర్ 31 రాత్రి, జనవరి 1 తేదీన ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని మద్యం సేవించి వాహనాలు నడపరాదని, రాంగ్ సైడ్ డ్రైవ్, రాష్ డ్రైవింగ్ చేయకూడదని, ఎవరైనా అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నారు.