నసురుల్లాబాద్ మండలం కొచ్చర మైసమ్మ ఆలయ ప్రాంగణంలో మంగళవారం చందూర్ మండలం బీజేపీ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసి బీజేపీ పార్టీ నాయకులను నిలపెట్టుకుంటామని దేశ ప్రధాని మోదీ ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.