చందూర్: అకాల వర్షం.. అన్నదాతల్లో గుబులు

84చూసినవారు
చందూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మంగళవారం ఉదయం నుండి ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. వందల ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. వారం రోజులు ఐతే కోత కోసి అమ్ముతామని ఆరు నెలలుగా కలలు కంటున్న రైతన్నకు చేదు అనుభవం ఎదురైంది. పంట నేల వాలి వరి ధాన్యం రాలిపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తమను ఆదుకోవాలంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్