చందూర్ మండల కేంద్రంలో ఎంఈఓగా అదనపు బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డిని పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది బుధవారం శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఈటి శ్రీనివాస్, స్వామి నాయక్, తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారి చేయడంతో సన్మానించినట్టు ఉపాధ్యాయులు తెలిపారు.