ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామం వడ్డెర కాలనీ వద్ద ఒక వ్యక్తి బైక్ పై నుండి పడి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళితే.. ముధోల్ మండలం బాసర గ్రామానికి చెందిన గురప్ప లక్ష్మణ్ జానకంపేట లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలొ కుర్నాపల్లి వద్దకు రాగానే బైక్ పై నుండి పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించగా, అక్కడికి చేరుకున్న బోధన్ 108 సిబ్బంది నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.