వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బోధన్ మున్సిపల్ కమిషనర్ కు సోమవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి యేషాల గంగాధర్ మాట్లాడుతూ వికలాంగులకు పింఛన్ రూ. 6000 పెంచాలని, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, ఉద్యోగాలలో 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.