పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లో ప్రసవించింది. వివరాలు వెళ్తే.. జల్లాపాలి గ్రామానికి చెందిన గంగామణికి బుధవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యుల 108 సిబ్బంది సమాచారమిచ్చారు. అంబులెన్స్‌లో గర్భిణీని తీసుకుని బాన్సువాడ ఆస్పత్రికి బయల్దేరారు. మార్గమధ్యంలో కొల్లూర్ వద్దకు చేరుకోగానే నొప్పులు తీవ్రం కావడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి కాన్పు చేశారు. పండంటి ఆడబిడ్డకు గంగామణి జన్మనిచ్చింది.