మంగళవారం రాత్రి రెంజల్ మండలం అంబేద్కర్ కాలనీ పేపర్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడపల్లికి చెందిన లింగం పనులు ముగించుకుని బైక్ పై సాటాపూర్ నుండి ఏడపల్లికి వస్తుండగా తన బైక్ అదుపుతప్పి క్రింద పడడంతో అతని ఎడమకాలు విరిగింది. దాంతో స్థానికులు గమనించి 108 కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బోధన్ 108 సిబ్బంది లక్ష్మణ్ మరియు జావేద్ లు ప్రథమ చికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.