రెంజల్: నూతన ఉపాధ్యాయులను సన్మానించిన గ్రామస్తులు

71చూసినవారు
రెంజల్: నూతన ఉపాధ్యాయులను సన్మానించిన గ్రామస్తులు
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులకు ఉపాధ్యాయ ఉద్యోగం రావడంతో వారిని ఆదివారం గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. కంఠం బాలకృష్ణ, అహ్మద్ పాషా, ఉమేర ఫాతిమాలకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వికార్ పాషా మాట్లాడుతూ, నూతనంగా ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరిన వీరిని స్ఫూర్తిగా తీసుకుని యువత ప్రభుత్వ పోటీ పరీక్షలకు హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్