బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లి ప్రాంతానికి చెందిన చౌడా రెడ్డి ఇంట్లో బుధవారం అర్ధరాత్రి ఇంట్లోకి దూరి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న బోధన్ టౌన్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాధితుని ఇంటి బయట ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దొంగలను త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.