కామారెడ్డిలో బాంబే క్లాత్ హౌస్ మరో బ్రాంచి ప్రారంభోత్సవానికి సోమవారం విచ్చేసిన ప్రముఖ సినీ హాస్య నటుడు సందడి చేశారు. క్లాత్ హౌస్ ప్రారంభించిన బ్రహ్మీ ప్రేక్షకులను ఉద్దేశించి కాసేపు జాలిగా మాట్లాడారు. తమ అభిమాన నటుడు బ్రహ్మానందంను చూసేందుకు జనం బారులు తీరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ తదితరులు ఉన్నారు.