నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి వేల్పూర్ లో ఉన్నటువంటి మినీ స్టేడియం ప్రహరీ గోడ ఒకసారి కుప్పకూలిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం రెండు గంటల పాటు దంచి కొట్టింది. ఈ భారీ వర్షానికి మరుసుకుంట చెరువు అలుగు పారింది.