విద్యుత్ షాక్కు రైతు మృతి
గాంధారి మండలం గుర్జాల్లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్జాల్ గ్రామానికి చెందిన అమర్ల బండ దేవేందర్రావు అలియాస్ రాజు (35) ఉదయం తన పొలంలో నియంత్రికకు వైరు ఊడిపోవడంతో దాన్ని కట్టెతో సరి చేస్తున్న క్రమంలో చేతులకు కరెంట్ షాక్ తగిలి స్పాట్లోనే మృతి చెందాడు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.