AP: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజును అభ్యర్థిగా ఎంపిక చేసింది. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మను ఆ పార్టీ ప్రకటించింది. జనసేన అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ వేశారు.