జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ

72చూసినవారు
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ
కామారెడ్డి జిల్లాలో అక్టోబర్ 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సిహెచ్. సింధుశర్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ శాఖ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని, పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్